13, సెప్టెంబర్ 2020, ఆదివారం

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా ... విప్రనారాయణ .1954

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

భాసిల్లెనుదయాద్రి బాల భాస్కరుడు
వెదజల్లె నెత్తావి విరబూసి విరులు
విరితేనెలాని మైమరచు తుమ్మెదలు
లేచెను విహగాళి లేచెను నిదురా

చల్లచల్లగ వీచె పిల్ల తెమ్మెరలు
రేయి వేగినది వేళాయె పూజలకు

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

పరిమళద్రవ్యాలు బహువిధములౌ నిధులు గైకొని దివ్యులు
కపిలధేనువును అద్దమ్ముపూని మహర్షి పుంగవులు
మురువుగా పాడ తుంబురు నారదులును
నీ సేవకై వచ్చె నిలచియున్నారు
సకుటుంబముగ సురేశ్వరులు
కానుకలు గైకొని మొగసాల కాచియున్నారు

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

దేవరవారికై పూవుల సరులు తెచ్చిన
తొండరడిప్పొడి మురియ
స్నేహదయాదృష్టి చిల్కగా జేసి
పెద్దను విడి కటాక్షింప రావయ్యా

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

10, ఆగస్టు 2020, సోమవారం

SUKLAMBARADHARAM .. శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ రచన

శుక్లాంబరధరం విష్ణుం 

శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్

సర్వ విఘ్నోపశాంతయే

అగజా ఆనన పద్మార్కం

గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం 

ఏకదంతముపాస్మహే...

ఏకదంతముపాస్మహే


వాతాపి గణపతిం భజేహం

వాతాపి గణపతిం భజేహం

వాతాపి గణపతిం భజేహం

వాతాపి గణపతిం భజేహం

వారణాశ్యం వరప్రదం శ్రీ

వారణాశ్యం వరప్రదం శ్రీ

వాతాపి గణపతిం భజే..ఏ...

భూతాది సంసేవిత చరణం

భూత భౌతిక ప్రపంచ భరణం

వీతరాగిణం వినత యోగిణం 

వీతరాగిణం వినత యోగిణం 

విశ్వకారణం విఘ్నవారణం

వాతాపి గణపతిం భజే

పురాకుంభ సంభవ మునివర

ప్రపూజితం త్రిభువన మధ్యగతం

మురారి ప్రముఖాద్యుపాసితం

మూలాధార క్షేత్రస్థితం

పరాది చత్వారి వాగాత్మకం 

ప్రణవ స్వరూప వక్రతుండం

నిరంతరం నిఖిల చంద్రఖండం

నిజవామకర విద్రుతేక్షుదండం

కరాంబుజ పాశ బీజాపూరం

కలుషవిదూరం భూతాకారం

కరాంబుజ పాశ బీజాపూరం

కలుషవిదూరం భూతాకారం

హరాది గురుగుహ తోషిత బింబం

హంసధ్వని భూషిత హేరంబం

వాతాపి గణపతిం భజేహం

వారణాశ్యం వరప్రదం శ్రీ

వాతాపి గణపతిం భజే... ఏ...




శరణంటిమయ్యా ... MOODU PUVVULU AARU KAAYALU 1978

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం

భజే వాయుపుత్రం భజే వాలగాత్రం

భజేహం భజేహం భజేహం...


శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయా

కరుణించవయ్యా వీరాంజనేయా

నమో వజ్రకాయ నమో భక్తగేయా

నమో దివ్య మహిమా ప్రమేయా

శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయా

కరుణించవయ్యా వీరాంజనేయా

🎼⛎🎷🔬🧲K🔗®️ 

శ్రీమన్ మహా మంగళాకార త్రైలోక్యమందార 

దుష్టారి సంహార శిష్టాత్మ సంచారా

సంసారపంకమ్మునందున్న మమ్ముద్ధరించంగ 

మా శోక దావానల జ్వాలలార్పంగ 

వేవేగ రావయ్య శ్రీ ఆంజనేయా…

శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయా

కరుణించవయ్యా వీరాంజనేయా

 🎼⛎♌♓♎🔈🔥®️ 

కన్నాము సామీరి కన్నాము స్వామి

ప్రసన్నమ్ము నీ మోము కన్నామయా

కోటి పుణ్యాలు పండించుకున్నామయా..

ఏమి వక్షంబు శ్రీ రామ పక్షంబు 

దాక్షిణ్య దక్షంబు ఆర్తాళి రక్షంబు

సాకార మోక్షంబూ..

మా వీక్షణంబుల్ కృతార్ధంబులాయెంగదా..

దైవ భక్తాగ్రగణ్యా అగణ్యంబు 

నీ కీర్తి మాన్యంబు నీ మూర్తి ధన్యంబు

ధన్యాతిధన్యంబు మా జన్మజాతంబు వాతాత్మజా ఆంజనేయా

శరణంటిమయ్యా శ్రీ ఆంజనేయా

కరుణించవయ్యా వీరాంజనేయా

 🎼⛎♌♓♎🌬💫®️

ఎన్నెన్ని ప్రాంతంబులెన్నెన్ని దుర్గమ్ములెన్నో 

అరణ్యమ్ములెన్నో గిరీంద్రమ్ములెన్నాళ్ళు 

శోధించి శోధించి 

క్షేత్రాలు దర్శించి తీర్ధాలు సేవించి 

మంత్రాలు వల్లించి తంత్రాలు ఛేదించి 

ఎన్నాళ్ళ కెన్నాళ్ళకూ..

వీక్షించినామయ్య నీ భవ్యరూపమ్ము

సారించవేమయ్య నీ దివ్యతేజమ్ము..

కుప్పించి లంఘించి అంబోధులన్ మించి 

ఆకాశపర్యంత సంవర్ధివై ఉగ్రతా స్ఫూర్తివై

ఛండభానుచ్చటామండితాఖండశక్తి ప్రపూర్ణుండవై సాగి రావయ్యా..

నా ఆత్మపీఠంబుపై నీ ప్రతిష్టార్థమై 

వేచి ఉన్నానయా..

రక్షమాం రక్షమాం చేరరావా 

అఖర్వ ప్రభావా అపూర్వానుభావ

అహో ఆంజనేయా..

ప్రసన్నాంజనేయా..

సువర్ణాంజనేయా..

నమస్తే నమస్తే నమస్తే నమః


3, ఆగస్టు 2020, సోమవారం

Dinakara from VINAYAKA CHAVITHI 1957

దినకరా
దినకరా
హే శుభకరా
దినకరా శుభకరా
దినకరా శుభకరా 
దేవా దీనాధారా తిమిరసంహార 
దినకరా శుభకరా
పతిత పావన మంగళదాత
పాపసంతాప లోకహితా
పతిత పావన మంగళదాత
పాపసంతాప లోకహిత
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూప
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూప
వివిధ వేద విజ్ఞాన నిధాన
వినత లోకపరిపాలక భాస్కర
దినకరా శుభకరా
దేవా దీనాధార తిమిరసంహార
దినకరా
హే దినకరా
ప్రభో దినకరా శుభకరా

20, ఫిబ్రవరి 2020, గురువారం

Neekem kaavaalo chappidi / నీకేం కావాలో చెప్పు..ఎంతవాడు గాని

నీకేం కావాలో చెప్పు
లోకమంత చూడాల చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా
నచ్చినవి కొనమని చెప్పు
నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త ఏరు ఈది చూద్దామా
రేయి పగలనక ఎండా వాననక
తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా
లోకమొక వైకుంఠపాళి కిందపడి లేచే మోళి
అన్నది అనుకోనిది కలిపి చూద్దామా

ఒక వెండి గొలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు
తొడగని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు
ఒక వెండి గొలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు
తొడగని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు
హహాహ ... ఆఆఆఆ...

కలలే చెరగవని కలతే వలదు అని
అనుదినం రాత్రి తనే నిదుర పుచ్చునులే
నా దరి నిన్ను చేర్చి నీకిరు కన్నులు ఇచ్చి
ఆ కళ్ళతోటి కలలు కాంచమన్నదిలే
అల్లరెంత చేసినా ఓర్చుకున్నాలే ఓ
నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే

తన తానన తననంతం
తన తానన తననంతం
తన తానన తననంతం
తన తానన తననంతం

నీకేం కావాలో చెప్పు
లోకమంత చూడాల చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా
నచ్చినవి కొనమని చెప్పు

నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త ఏరు ఈది చూద్దామా

ఋతువులు మారిపోగా కాలమిట్టే దొర్లిపోగా
తీపి జ్ఞాపకాలు నీలో చూసాలే
రాసే నీ వేళ్ళు చూసి
నవ్వే నీ పెదవి చూసి
మరచిన కవితలెన్నో గురుతుకొచ్చెనులే
ధృవముల నడుమ సాగె దూరమానాడు ఓ
భుజమున నీ శ్వాస ఊగెను నేడు

తన తానన తననంతం
తన తానన తననంతం
తన తానన తననంతం
తన తానన తననంతం

నీకేం కావాలో చెప్పు
లోకమంతా చూడాలా చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా
నచ్చినవి కొనమని చెప్పు
నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త ఏరు ఈది చూద్దామా
రేయి పగలనక ఎండా వాననక
తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా

లోకమొక వైకుంఠపాళి కిందపడి లేచే మోళి
అన్నది అనుకోనిది కలిపి చూద్దామా
ఒక వెండి గొలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు
ఒక వెండి గొలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు

Sri Venkateswara Suprabhatham by Ghantasaala / శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము

కౌసల్య తనయ శ్రీ రామ కౌస్తుభాంగా
తూర్పున భానుడుదయించె తోయజాక్షా
దేవ సంబంధ కార్యాలను తీర్చుకోగ
వేడుకొందుము మేలుకో శ్రీ వేంకటేశా

లేవయ్య శ్రీహరి గోవింద లెమ్ము నిదురా
కళ్యాణమొనరింప వేగ కమలనయనా
ప్రొద్దెక్కనున్నదటు చూడ భుజగశయనా
వేగ లేవయ్య మము బ్రోవ వేంకటేశా..ఆ.

మధుకైటభారి శ్రీహరి ప్రక్కనుండి
ఎల్ల లోకములను కన్న మా తల్లి లక్ష్మీ
ఆశ్రిత మానవుల సదా ఆదరించ
అలమేలు మంగ ఇక మేలుకొమ్మా

బ్రహ్మాది దేవతలందరు భక్తి మీర
సురగురూత్తముని వెంట తరలి నేడు
నీ దివ్య రూపంబు కానగ నిలచినారు
శీఘ్రముగ లేవయ్య శ్రీ శ్రీనివాసా

కమలాలు వికసించు కాలమాయె
నానా సుగంధ కుసుమాలు నవ్వెనవిగో
పక్షుల గుంపుల తీయని పాట వినగ
వేగ లేవయ్య నిదుర శ్రీ వేంకటేశా

గ్రహములన్నియు నీ అనుగ్రహము పొంద
అష్టదిక్పాలురందరును నిష్ఠ తోడ
నీదు పుష్కర స్నానమాడి నిలచినారు
చూడ లేలెమ్ము అయ్యెనిక సుప్రభాతం

పద్మనాభ పురుషోత్తమ పాపనాశా
వేంకటాచలపతి విభో వేంకటేశా
శీఘ్రముగ లేవయ్య ప్రభు శ్రీనివాసా
చూడ మా తండ్రి అయ్యెనిక సుప్రభాతం.. సుప్రభాతం ..

ఆకాశ గంగోదకంబును లోకనాధ తెచ్చి
పూజాదులకై ముందె వచ్చిరయ్యా
వేదోపనిషన్మూర్తులౌ వైదికులును
వేచి ఉన్నారు లేవయ్య శ్రీ వేంకటేశా...ఆ...

లేచి నిను చూడ ఈవేళ నోచినాము ప్రభూ..
లేచి నిను చూడ ఈవేళ నోచినాము
ఏ పూర్వ పుణ్యఫలముగా ఎరుగలేము
చేసిన పాపాలు నేటితో మాసిపోగ
వేడుకొందుము కరుణించు వేంకటేశా..ఆ...ఆ...

మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం

15, జనవరి 2019, మంగళవారం

Amma annadi oka kammani maata/ అమ్మ అన్నది ఒక కమ్మని మాట - బుల్లెమ్మ బుల్లోడు- 1972

అ: అమ్మ అన్నది ఒక కమ్మని మాట  అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట
    అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట మమతల మూట

అ: దేవుడే లేడనే మనిషున్నాడు అమ్మే లేదనువాడు అసలే లేడు
    దేవుడే లేడనే మనిషున్నాడు అమ్మే లేదనువాడు అసలే లేడు
    తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
ఆ: తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు
అ: అమ్మ అన్నది 
ఆ: ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట

అమ్మంటే అంతులేని సొమ్మురా 
ఆ: అది ఏ నాటికి తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ మనసు అమృతమే చిందురా
ఆ: అమ్మ ఒడిలోన స్వర్గమే వుందిరా వుందిరా
ఇ: అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట

ఇ: అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అ: అమ్మ వున్న ఇంటిలో లేనిది ఏది అమ్మ వున్న ఇంటిలో లేనిది ఏది
అమ్మ అనురాగం ఇకనుంచి నీది నాది
ఇ: అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట 

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా ... విప్రనారాయణ .1954

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా భాసిల్లెనుదయాద్రి బాల భాస్కరుడు వెదజల్లె నెత్తావి విరబూసి విరులు విరితేనెలాని మైమరచు ...