15, జనవరి 2019, మంగళవారం

Amma annadi oka kammani maata/ అమ్మ అన్నది ఒక కమ్మని మాట - బుల్లెమ్మ బుల్లోడు- 1972

అ: అమ్మ అన్నది ఒక కమ్మని మాట  అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట
    అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట మమతల మూట

అ: దేవుడే లేడనే మనిషున్నాడు అమ్మే లేదనువాడు అసలే లేడు
    దేవుడే లేడనే మనిషున్నాడు అమ్మే లేదనువాడు అసలే లేడు
    తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
ఆ: తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు
అ: అమ్మ అన్నది 
ఆ: ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట

అమ్మంటే అంతులేని సొమ్మురా 
ఆ: అది ఏ నాటికి తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ మనసు అమృతమే చిందురా
ఆ: అమ్మ ఒడిలోన స్వర్గమే వుందిరా వుందిరా
ఇ: అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట

ఇ: అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అ: అమ్మ వున్న ఇంటిలో లేనిది ఏది అమ్మ వున్న ఇంటిలో లేనిది ఏది
అమ్మ అనురాగం ఇకనుంచి నీది నాది
ఇ: అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట 

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా ... విప్రనారాయణ .1954

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా భాసిల్లెనుదయాద్రి బాల భాస్కరుడు వెదజల్లె నెత్తావి విరబూసి విరులు విరితేనెలాని మైమరచు ...