20, ఫిబ్రవరి 2020, గురువారం

Neekem kaavaalo chappidi / నీకేం కావాలో చెప్పు..ఎంతవాడు గాని

నీకేం కావాలో చెప్పు
లోకమంత చూడాల చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా
నచ్చినవి కొనమని చెప్పు
నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త ఏరు ఈది చూద్దామా
రేయి పగలనక ఎండా వాననక
తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా
లోకమొక వైకుంఠపాళి కిందపడి లేచే మోళి
అన్నది అనుకోనిది కలిపి చూద్దామా

ఒక వెండి గొలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు
తొడగని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు
ఒక వెండి గొలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు
తొడగని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు
హహాహ ... ఆఆఆఆ...

కలలే చెరగవని కలతే వలదు అని
అనుదినం రాత్రి తనే నిదుర పుచ్చునులే
నా దరి నిన్ను చేర్చి నీకిరు కన్నులు ఇచ్చి
ఆ కళ్ళతోటి కలలు కాంచమన్నదిలే
అల్లరెంత చేసినా ఓర్చుకున్నాలే ఓ
నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే

తన తానన తననంతం
తన తానన తననంతం
తన తానన తననంతం
తన తానన తననంతం

నీకేం కావాలో చెప్పు
లోకమంత చూడాల చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా
నచ్చినవి కొనమని చెప్పు

నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త ఏరు ఈది చూద్దామా

ఋతువులు మారిపోగా కాలమిట్టే దొర్లిపోగా
తీపి జ్ఞాపకాలు నీలో చూసాలే
రాసే నీ వేళ్ళు చూసి
నవ్వే నీ పెదవి చూసి
మరచిన కవితలెన్నో గురుతుకొచ్చెనులే
ధృవముల నడుమ సాగె దూరమానాడు ఓ
భుజమున నీ శ్వాస ఊగెను నేడు

తన తానన తననంతం
తన తానన తననంతం
తన తానన తననంతం
తన తానన తననంతం

నీకేం కావాలో చెప్పు
లోకమంతా చూడాలా చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా
నచ్చినవి కొనమని చెప్పు
నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త ఏరు ఈది చూద్దామా
రేయి పగలనక ఎండా వాననక
తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా

లోకమొక వైకుంఠపాళి కిందపడి లేచే మోళి
అన్నది అనుకోనిది కలిపి చూద్దామా
ఒక వెండి గొలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు
ఒక వెండి గొలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు

Sri Venkateswara Suprabhatham by Ghantasaala / శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము

కౌసల్య తనయ శ్రీ రామ కౌస్తుభాంగా
తూర్పున భానుడుదయించె తోయజాక్షా
దేవ సంబంధ కార్యాలను తీర్చుకోగ
వేడుకొందుము మేలుకో శ్రీ వేంకటేశా

లేవయ్య శ్రీహరి గోవింద లెమ్ము నిదురా
కళ్యాణమొనరింప వేగ కమలనయనా
ప్రొద్దెక్కనున్నదటు చూడ భుజగశయనా
వేగ లేవయ్య మము బ్రోవ వేంకటేశా..ఆ.

మధుకైటభారి శ్రీహరి ప్రక్కనుండి
ఎల్ల లోకములను కన్న మా తల్లి లక్ష్మీ
ఆశ్రిత మానవుల సదా ఆదరించ
అలమేలు మంగ ఇక మేలుకొమ్మా

బ్రహ్మాది దేవతలందరు భక్తి మీర
సురగురూత్తముని వెంట తరలి నేడు
నీ దివ్య రూపంబు కానగ నిలచినారు
శీఘ్రముగ లేవయ్య శ్రీ శ్రీనివాసా

కమలాలు వికసించు కాలమాయె
నానా సుగంధ కుసుమాలు నవ్వెనవిగో
పక్షుల గుంపుల తీయని పాట వినగ
వేగ లేవయ్య నిదుర శ్రీ వేంకటేశా

గ్రహములన్నియు నీ అనుగ్రహము పొంద
అష్టదిక్పాలురందరును నిష్ఠ తోడ
నీదు పుష్కర స్నానమాడి నిలచినారు
చూడ లేలెమ్ము అయ్యెనిక సుప్రభాతం

పద్మనాభ పురుషోత్తమ పాపనాశా
వేంకటాచలపతి విభో వేంకటేశా
శీఘ్రముగ లేవయ్య ప్రభు శ్రీనివాసా
చూడ మా తండ్రి అయ్యెనిక సుప్రభాతం.. సుప్రభాతం ..

ఆకాశ గంగోదకంబును లోకనాధ తెచ్చి
పూజాదులకై ముందె వచ్చిరయ్యా
వేదోపనిషన్మూర్తులౌ వైదికులును
వేచి ఉన్నారు లేవయ్య శ్రీ వేంకటేశా...ఆ...

లేచి నిను చూడ ఈవేళ నోచినాము ప్రభూ..
లేచి నిను చూడ ఈవేళ నోచినాము
ఏ పూర్వ పుణ్యఫలముగా ఎరుగలేము
చేసిన పాపాలు నేటితో మాసిపోగ
వేడుకొందుము కరుణించు వేంకటేశా..ఆ...ఆ...

మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా ... విప్రనారాయణ .1954

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా భాసిల్లెనుదయాద్రి బాల భాస్కరుడు వెదజల్లె నెత్తావి విరబూసి విరులు విరితేనెలాని మైమరచు ...